భారతదేశంలో ప్రముఖ విద్యాసంస్థలుగా పేరు ప్రఖ్యాతి పొందిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు మరో మైలురాయిని అధిగమించాయి. నవంబర్ 6న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్‌లో 20 రాష్ట్రాల నుండి పదివేల మంది శ్రీ చైతన్య విద్యార్థులు పాల్గొని 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పఠించి ప్రపంచ రికార్డు సృష్టించారు.