ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఏడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, గజవాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.. మరోరోజు ఆరో రోజు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగాయి..