నరేశ్, ఆలీతో పాటు మెట్రోట్రైన్ ముఖ్యభూమిక పోషించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు…