ఇవాళ జరిగిన ఏపీ కేబినేట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై కెబినెట్లో ఎందుకు చర్చించ లేదు..? మాదకద్రవ్యాలు, గంజాయి ప్రస్తావన రాగానే దేశమంతా ఏపీ పేరే వినిపిస్తుంటే, కేబినేట్‌కు మాత్రం వినపడలేదన్నారు. ? లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఎయిడెడ్ విద్యాసంస్థలపై మంత్రివర్గం ఎందుకు చర్చించలేదు..? విశాఖలో స్వామీజీ ఆశ్రమానికి రైతులభూములు తక్కువ ధరకు అప్పగించడానికే ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించిందా?…