ఇక్కడ చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకురాలేక.. దుబాయ్, కువైట్ వంటి ప్రాంతాలకు పెదవాళ్ళు వెళుతుంటారు. అనతి కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో, కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఒంటరి పోరాటానికి బయలుదేరుతారు. దీన్నే అలుసుగా తీసుకొని, కొందరు ఏజెంట్లు నేలపై ఆకాశం చూపించేందుకు ప్రయత్నిస్తారు. అక్కడికెళ్ళాక ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా తాము చూసుకుంటామంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. పాపం.. వారి మాటలకు లొంగి, తమ జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక, ఏజెంట్లు…