భారత సనాతన సంప్రదాయం ప్రకారం జంతువులను పూజించడం ఆచారం. దీనికి గల కారణం సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు. అంతేకాదు మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు. ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు. అయితే.. వేదాల్లో నాగ పూజ కనిపించకున్న సంహితాల్లో, బ్రాహ్మణాల్లో నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజించే ప్రసక్తి. నాగుపాములను ముఖ్యంగా దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తిక శుద్ధ చవితి నాడు కొలుస్తారు. దీనినే నాగుల…