తెలుగు రాష్ట్రాలు కళ్యాణ శోభ సంతరించుకున్నాయి. ఎటు చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తుంది. శ్రావణ మాసం రావడంతో శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నాయి. దీంతో లక్షల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మూఢం, ఆషాఢం కారణంగా 48 రోజుల పాటు శుభకార్యాలు జరగలేదు. దీంతో బంగారం, వెండి ఆభరణాల షాపులు వెలవెలబోయాయి. వస్త్ర దుకాణాల్లో బిజినెస్ పడిపోయింది. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు బోసిపోయాయి. పురోహితులకు పని లేకుండా పోయింది. కానీ... శ్రావణం వస్తూనే సందడి మొదలైంది. పెళ్లిళ్లు, శుభకార్యాల ఏర్పాట్లలో…