గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన హర్యానాలోని సిర్సాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా కేరళ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రచారంలో అతిథిగా పాల్గొన్నట్లు తెలిసింది. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పీఏ. మహమ్మద్ రియాస్ నేతృత్వంలోని టూరిజం డిపార్ట్‌మెంట్ అమెకు స్పాన్సర్ చేసిందని వార్తలు చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి మహమ్మద్ రియాస్ స్పందించారు.
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అందరినీ ఆశ్చర్య పరిచింది. పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు అనంతరం అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి పాకిస్థాన్, చైనాతో సహా అనేక దేశాలకు ప్రయాణించిందని చెబుతున్నారు. కేవలం రూ.20,000 ఉద్యోగంతో ప్రారంభించిన జ్యోతి, ఇప్పుడు ప్రసిద్ధ యూట్యూబర్‌గా మారింది.