ఉత్తర ప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. టికెట్లు ధృవీకరణ కాకపోవడంతో ఒడిశాకు చెందిన 18 మంది అథ్లెట్లు రైలులోని టాయిలెట్ల సమీపంలో కూర్చుని ప్రయాణించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లో నిర్వహించిన 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఒడిశా నుంచి 10 మంది బాలురు, 8 మంది బాలికలు కలిపి మొత్తం 18…