ఫుట్‌బాల్‌ను ఫాలో అయ్యే ప్రేక్షకులకు ఎల్లో, రెడ్ కార్డుల గురించి తెలిసే ఉంటుంది. గ్రౌండ్‌లో ప్లేయర్స్ దురుసుగా ప్రవర్తిస్తుంటే రిఫరీలు ఈ కార్డులను చూపిస్తుంటారు. దీని వల్ల అప్పటికప్పుడు ఫీల్డ్ నుంచి బయటకు పంపించేయడం, తర్వాత మ్యాచ్ ఆడకుండా నిషేధించడంలాంటి చర్యలు ఉంటాయి. అయితే ఈ ఆటలో మరో కార్డు కూడా ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఇది ప్లేయర్లను శిక్షించడానికి మాత్రం కాదు. బాగా ఆడినందుకు మెచ్చుకుంటూ ఇచ్చేది. అదే వైట్ కార్డు. ఫుట్‌బాల్ హిస్టరీలో…