Football: ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. హాట్‌టాపిక్‌గా వైట్ కార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫుట్‌బాల్‌ను ఫాలో అయ్యే ప్రేక్షకులకు ఎల్లో, రెడ్ కార్డుల గురించి తెలిసే ఉంటుంది. గ్రౌండ్‌లో ప్లేయర్స్ దురుసుగా ప్రవర్తిస్తుంటే రిఫరీలు ఈ కార్డులను చూపిస్తుంటారు. దీని వల్ల అప్పటికప్పుడు ఫీల్డ్ నుంచి బయటకు పంపించేయడం, తర్వాత మ్యాచ్ ఆడకుండా నిషేధించడంలాంటి చర్యలు ఉంటాయి. అయితే ఈ ఆటలో మరో కార్డు కూడా ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఇది ప్లేయర్లను శిక్షించడానికి మాత్రం కాదు. బాగా ఆడినందుకు మెచ్చుకుంటూ ఇచ్చేది. అదే వైట్ కార్డు. ఫుట్‌బాల్ హిస్టరీలో ఇప్పటివరకు ఈ వైట్‌కార్డును రిఫరీలు ఉపయోగించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఓ విమెన్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఈ కార్డు కనిపించింది. దీంతో నెట్టింట ఇప్పుడంతా ఈ కార్డు గురించే చర్చ. మరి ఈ కార్డు విషయాలేంటో చూద్దామా.
Also Read
- Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై 'కింగ్' కోహ్లీ కన్ను!
- Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
- Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
- Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
అసలు ఈ వైట్ కార్డు ఎందుకు!
పోర్చుగల్‌లో జరిగిన ఓ విమెన్స్ మ్యాచ్‌లో ఈ వైట్ కార్డు కనిపించింది. బెన్ఫికా-స్పోర్టింగ్ లిస్బన్ మధ్య ఆ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా రిఫరీ ఆకస్మాత్తుగా తన జేబులో నుంచి ఓ వైట్ కార్డు తీసి చూపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యంతోపాటు ఆనందానికి కూడా గురయ్యారు. రిఫరీ చేసిన పనిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లతో ప్రశంసించారు. కాగా ఈ తాజా మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని సడెన్‌గా అస్వస్థతకు గురయ్యాడు. అది చూసిన రెండు జట్ల మెడికల్ టీమ్స్ హుటాహుటిన ఆ అభిమాని దగ్గరికు వెళ్లి చికిత్స అందించాయి. వాళ్ల క్రీడాస్ఫూర్తిని అభినందిస్తూ రిఫరీ వైట్ కార్డు చూపించాడు. ఓ మ్యాచ్ సందర్భంగా ఫెయిర్ ప్లే ఆడుతున్న ఈ టీమ్స్‌ను అభినందిస్తూ ఈ వైట్ కార్డును ప్రవేశపెట్టారు. దీనివల్ల ఫీల్డ్‌లో మంచి వాతావరణంలో మ్యాచ్ జరుగుతుందన్నది ఫిఫా ఉద్దేశం. పోర్చుగల్‌లో ఈ వైట్ కార్డును తొలిసారి పరిచయం చేశారు.
కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడా? హర్ష గోయెంక ట్వీట్‌పై నెటిజన్ల కామెంట్స్
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?