2023 వన్డే ప్రపంచకప్‌లో మూడింటిలో మూడు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియా.. రేపు బంగ్లాదేశ్ తో తలపడనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్స్ లేవని మాంబ్రే స్పష్టం చేశాడు.