ప్రముఖుల పేర్లతో ఖాతాలు సృష్టిస్తూ.. మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నిర్మల్, నారాయణపేట పాలనాధికారుల పేరుతో మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరగాళ్లు.. తాజాగా.. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రాఫ్ అలీ పేరుతో నకిలీ వాట్సాప్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు.