Skyroot Aerospace: వ్యక్తి/వ్యవస్థ ఎదుగుదలకు ఆకాశమే హద్దు అంటుంటారు. కానీ.. మనిషి ఊహలకు హద్దులు ఉండవు. లైఫ్‌లో అంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం నిబద్ధతతో పరితపిస్తే వ్యక్తే వ్యవస్థగా మారతాడు. అలాంటివారికి తాజా ఉదాహరణ స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఫౌండర్ పవన్ చందన. స్కైరూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్. ‘ఎన్-బిజినెస్‘ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్యూలో పవన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..