Starlink: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు భారతదేశం కీలక అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు తుది అనుమతులు వచ్చినట్లు అయింది. బుధవారం దేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుండి ఆమోదం పొందింది.