Space Out Competition: ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లు, డిజిటల్ పరికరాలకు అతుక్కుపోతున్న ప్రస్తుత ప్రపంచంలో దక్షిణ కొరియా ప్రజలు మొబైల్ వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ప్రత్యేకమైన పోటీ ఉంటుంది. దీనిని ‘స్పేస్ అవుట్’ అని పిలుస్తారు. ఇక ఈ కార్యక్రమం కోసం పోటీలో పాల్గొనే పోటీదారులు 90 నిమిషాల పాటు ఏమీ చేయనవసరం లేదు. అవును, ఎలాంటి సంభాషణ అవసరం లేదు. కదలాల్సిన అవసరం లేదు.…