South Central Railway: దేశంలో అనేక ప్రాంతాల్లో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పట్టాలెక్కనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అధికారిక సమాచారం అందింది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా వందేభారత్ రైలును కేటాయిస్తూ స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వయా కాజీపేట మీదుగా ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రైలును ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు…