Afghanistan: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన అశాంతి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా, ఆఫ్ఘనిస్థాన్ పాక్ దళాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. తాజాగా రెండు దేశాలు ఇప్పటికీ దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తాలిబన్లు లష్కరే తోయిబా శిబిరంలో పెరిగిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేశారు.
పాకిస్తాన్ కోరికను నెరవేర్చాడు డోనాల్డ్ ట్రంప్. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)ని విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా అమెరికా అధికారికంగా ప్రకటించింది. BLA అనుబంధ సంస్థ ‘ది మజీద్ బ్రిగేడ్’ ను కూడా ఈ జాబితాలో చేర్చారు. బలూచ్ తిరుగుబాటుదారులపై ప్రపంచ స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన విజ్ఞప్తి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. Also Read:Story Board : బంగారం…