దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫైనల్ కి ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ప్రొటీస్ కెప్టెన్ లారా మాట్లాడుతూ.. సొంత మైదానంలో ఆడడం వల్ల భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.. ఆ జట్టు గెలవాలని దేశం మొత్తం ఆశిస్తుంది పేర్కొనింది. కానీ ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. వాళ్ల ఒత్తిడే మాకు అనుకూలంగా మారుతుందని తెలిపింది.