Soundarya Jayanthi Special : సౌందర్య… ఈ పేరు వినగానే ఇప్పటికీ ఎంతోమంది మదిలో వీణలు మోగుతాయి. సౌందర్య అందమైన అభినయం మరపురాకుండా మధురూహలలో పయనించేలా చేస్తుంది. సౌందర్య ముగ్ధమనోహర రూపం చూసి, ఇలాంటి అమ్మాయి పరిచయమయితే ఎంత బాగుంటుందో అనుకుంటూ కలల్లో తేలిపోయినవారూ ఉన్నారు. సౌందర్య లాంటి అమ్మాయి కావాలని కోరుకున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. అలాంటి నేస్తం ఉంటే బాగుంటుందని భావించిన మనసులకూ కొదువలేదు. ఏమయితేనేమి, సౌందర్యను ఆమె మాతృభూమి కన్నడ నేలకన్నా మిన్నగా తెలుగువారు…