అమెజాన్ ప్రైమ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ “సూరారై పొట్రు”. సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ హిట్ రీమేక్ లో అక్కడ హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ జాబితాలో పలువురు స్టార్ హీరోల పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ స్థానంలో…
సూర్య కథానాయకుడిగా రూపుదిద్దుకున్న ‘సూరారై పోట్రు’ తమిళంలోనే కాదు ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ అయ్యి, ఓటీటీలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు సూర్య అభిమానులనూ అలరించింది. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను నిర్మించిన సూర్య ఇప్పుడు హిందీలోనూ దీన్ని రీమేక్ చేస్తున్నట్టు తెలిపారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అబుందాంతియా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను…