వెండితెరపై విలన్‌గా అలరించిన సోనూసూద్, నిజ జీవితంలో మాత్రం కోట్లాది మందికి ఆపద్బాంధవుడిగా మారి రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తాజాగా ఆయన తన ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా ఒక గొప్ప కార్యాన్ని పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్న 500 మంది పేద మహిళలకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించారు. ఈ సందర్భంగా సోనూసూద్ స్పందిస్తూ.. ‘500 మంది తల్లులు, సోదరీమణులు కొత్త జీవితాన్ని పొందడం, వారి కుటుంబాల్లో ఆనందం…
సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ సంస్థ 2022కి గానూ ప్రతిష్ఠాత్మక నేషన్స్ ప్రైడ్ అవార్డును సోనూసూద్ కు అందచేసింది. సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ అవార్డును సోనూసూద్ కు అందచేశారు.
కోవిద్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అప్పటి నుంచి ఆయన గోల్డెన్ హార్ట్ ను చూసి రియల్ హీరో అని పిలవడం మొదలు పెట్టారు జనాలు. ఇక అదే సమయంలో సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు సోనూసూద్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని, లేదా సర్జరీలు వంటి వాటికి వారి ఆర్ధిక పరిస్థితి బాలేదని ఆయన దృష్టిని వచ్చినా… వెంటనే స్పందించి, వాళ్లకు చికిత్స అందేలా చేస్తున్నారు. అలాగే తాజాగా…