వెండితెరపై విలన్‌గా అలరించిన సోనూసూద్, నిజ జీవితంలో మాత్రం కోట్లాది మందికి ఆపద్బాంధవుడిగా మారి రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తాజాగా ఆయన తన ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా ఒక గొప్ప కార్యాన్ని పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్న 500 మంది పేద మహిళలకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించారు. ఈ సందర్భంగా సోనూసూద్ స్పందిస్తూ.. ‘500 మంది తల్లులు, సోదరీమణులు కొత్త జీవితాన్ని పొందడం, వారి కుటుంబాల్లో ఆనందం…