Sonusood : యాక్టర్ సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలతో కరోనా నుంచి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. హీరోలకు మించి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. విద్యార్థులు, నిరుపేదలకు ఏ అవసరం వచ్చినా సోనూసూద్ సాయం చేస్తున్నారు. తన ఇంటికి వచ్చిన వందలాది మందికి ఏదో ఒక విధంగా సాయం అందిస్తున్నాడు. అటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. జులై 30న ఆయన 52వ బర్త్ డే ఉంది.…
తెరపై కనిపించేదంతా నిజం కాదు అని సినిమాలు చూసే జనానికి తెలుసు. కానీ, తాము అభిమానించే నటీనటులు కనబరిచే అభినయానికి ఫిదా అయిపోతూ, ఈలలు కేకలు వేసి ఆనందిస్తుంటారు. అలాగే తెరపై కరడుగట్టిన హృదయం ఉన్న విలన్ గా నటించేవారికి, నిజజీవితంలో కరుణ చూపే తత్వం ఉంటుందని తెలిసినప్పుడూ జనం అదే తీరున స్పందిస్తూ ఉన్నారు. అనేక చిత్రాలలో ప్రతినాయకునిగా పలకరించి, భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఇదిగో నేనున్నానంటూ ముందడుగు వేస్తున్నారు.…