son carry mother's dead body on bike: మధ్యప్రదేశ్ లో మరోసారి ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యం బయటపడింది. తల్లి శవాన్ని బైక్ పై స్వగ్రామానికి తీసుకెళ్లాడు ఓ కుమారుడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో.. బైక్ పై తల్లి శవాన్ని పెట్టుకుని సొతూరుకు వెళ్లారు. ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. సామాన్యుడికి అందాల్సిన కనీస సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయని పలువురు ప్రజలు మండి పడుతున్నారు.