ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల పాడ్‌కాస్ట్‌లో పెద్ద ప్రకటన చేశారు. ఈ పోడ్‌కాస్ట్‌లో గ్రహాంతర నాగరికతల ఉనికి గురించి చర్చించారు. విశ్వంలో గ్రహాంతర వాసులు ఖచ్చితంగా ఉన్నారని.. వారి నాగరికతలు వివిధ రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సోమనాథ్ చెప్పారు. ఏలియన్స్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.