అస్సాంలోని కాకోపథర్‌లోని భారత ఆర్మీ శిబిరంపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి. స్థానిక నివేదికల ప్రకారం.. ఆకస్మిక దాడిని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-K-YA), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA-ఇండిపెండెంట్) సంయుక్త బృందం నిర్వహించాయి. ఈ రెండూ కూడా నిషేధిత తిరుగుబాటు సంస్థలు.
జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఒక అగ్ర ఉగ్రవాది హతమయ్యాడు. లష్కర్ ఉగ్రవాది అల్తాఫ్ లాలిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి బండిపోరాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
Encounter in Kupwara: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. ఉత్తర కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు.