వృత్తిరీత్యా అతనో టెక్కీ, కానీ కరోనా దెబ్బకు ప్రముఖ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తీసుకురావడంతో చాలా మంది తాము చేస్తున్న పనులకు అదనంగా కొత్త దారుల వెంట పయనిస్తున్నారు. ఈ కోవలోకే వస్తాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పదిరి మాధవ రెడ్డి. వ్యవసాయంపై మక్కువతో ఆధునిక సాగుతో లాభదాయకమైన పంటలను వినూత్న పద్ధతులతో పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు..సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్‌కు చెందిన పదిరి మాధవరెడ్డి. ఈ కోవిడ్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పని…
తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ విద్యుత్ నగర్‌లో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది… భార్య, భర్త ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విద్యుత్ నగర్ లో చంద్రకాంత రావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయనకు గత కొంతకాలంగా భార్యతో తరచూ గొడవలు…
డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతున్నారు కొందరు.. అందులో చదువుకున్నవారు కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా మారింది. ఉన్నత చదువు చదువుకొని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక యువకుడు తక్కువకాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడ్డదారి తొక్కి జైలుపాలయ్యిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. విజయవాడ ఫకీరుగూడెం కు చెందిన సోహైల్(21) అనే యువకుడు కష్టపడి చదువుకొని సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆశించినంత డబ్బు రాకపోవడంతో అడ్డదారి పట్టాడు.…
ఎన్ని చదువులు చదువుకొని ఏమి ప్రయోజనం సంస్కారం లేకపోతే.. ఇంకా సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పోలేదని కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధిస్తున్న భర్తలకు కొదువే లేదు. తాజాగా ఒక ప్రబుద్దుడు కూడా వరుసగా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భార్యను పుట్టింటికి పంపి, వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్య, భర్త ఇంటిముందు ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని…
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి గాజులరామారంలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. మూడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడంలేదనే మనస్తాపంతో భవానీ అనే వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.