హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి గాజులరామారంలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. మూడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడంలేదనే మనస్తాపంతో భవానీ అనే వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.