సోడాలు, వివిధ రకాల కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఇవే కాకుండా, పండ్ల రసాల వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ గాల్వే, మెక్‌మాస్టర్ యూనివర్శిటీ, కెనడా నిపుణులు, అంతర్జాతీయ స్ట్రోక్ నిపుణుల బృందం చేసిన తాజా పరిశోధనలో ఇది వెల్లడైంది.