సోషల్ మీడియాలో కామెంట్లు శృతిమించుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు అడ్డుఅదుపులేకుండా పోతోంది. సెలబ్రిటీలు, రాజకీయనేతలు, సినీతారలు.. ఇలా ఒకరిని కాదు.. అసభ్యకరమైన బూతులు, కామెంట్ల రూపంలో వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ కుమారుడిపై జరిగిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి వ్యక్తిత్వ దాడిని అరికట్టలేమా?