ఒకవైపు అమెరికాను కరోనాతో పాటు మరో సమస్య వణికిస్తున్నది. గత కొన్నిరోజులుగా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో మంచుతుఫాను కురుస్తున్నది. మంచుతోపాటు వేగంగా గాలులు వీస్తుండటంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. దీనిని నార్ ఈస్టర్ అని పిలుస్తారు. ఈ పరిస్థితి మరింత దిగజారి పీడనం పడిపోతే మంచు గట్టలు గుట్టలుగా పడిపోతుంది. దీనిని బాంబ్ సైక్లోన్ అని పిలుస్తారు. ప్రస్తుతం అమెరికాలోని అనేక ప్రాంతాలను ఈ బాంబ్ సైక్లోన్ అతలాకుతలం చేస్తున్నది. మంచు అడుగులమేర పేరుకుపోయింది. న్యూయార్క్, బోస్టన్…