Special Story on Snapdeal Founders: మన దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్ ప్లేసుల్లో ఒకటైన స్నాప్‌డీల్ సక్సెస్ స్టోరీ వెనక ఇద్దరు మిత్రులున్నారు. వాళ్లే.. కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్. స్నాప్‌డీల్ విజయవంతం కావటంతో వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా యూనికార్న్‌లు మరియు సూనికార్న్‌ల్లో వ్యక్తిగతంగా భారీఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అవి అనూహ్యంగా లాభాలను ఆర్జిస్తుండటంతో ఇద్దరి సంపద దాదాపు 200 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.