వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలోని పొదలు, గుంతలు, పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాంటి సమయంలో తెలిసీ, తెలియక వాటిపై అడుగేయడం వల్ల కాటేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పదుల సంఖ్యలో పాము కాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. పాములన్నీ విషయ పూరితాలు కావు. రక్తపింజర, కట్లపాము, నాగుపాములు మాత్రం చాలా విషపూరితమైనవి.
భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 లక్ష 40 వేల మంది విషపూరిత పాము కాటు కారణంగా మరణిస్తున్నారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం సకాలంలో చికిత్స లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. కానీ కెన్యాలో కనుగొన్న ఒక ఆవిష్కరణ ఇప్పుడు పాము కాటుకు చికిత్సను సులభతరం చేసింది. ఇంట్లోనే తమ శరీరంలోని పాము విషాన్ని సులభంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.