శనివారం దుబాయ్ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన బీ-737-800 విమానం కేరళ మీదుగా దుబాయ్ చేరుకోగా.. కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని, ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ విచారణ జరుపుతోందని సీనియర్ అధికారి తెలిపారు.