టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసింది. దాంతో మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్మృతి ఈ రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు మరే ఇతర మహిళా క్రీడాకారిణి ఈ ఘనత సాధించలేదు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్…