ఓ మహిళ ప్రయాణికురాలు రైలులో ప్రయాణిస్తున్న వేళ.. తాను పడిన బాధను రెడ్డిట్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత గురించి మరోసారి లేవనెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వనాంచల్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లో వెళ్తున్న తనను.. ఓ వ్యక్తి ఎలా వేధించాడో తెలిపింది. తాను.. స్లీపర్ కోచ్‌లో ఒంటరిగా ప్రయాణించడం ఇదే తొలిసారి అని చెప్పింది. కోచ్లో ఇద్దరు మగ ప్రయాణికులు తన ముందు సీట్లోనే కూర్చున్నారని.. అంతా బాగానే ఉందని…