రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టండని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమన్నారు. దేశ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీకి ఆయన లేఖ రాశారు. ‘రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరం. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక…
ప్రధాని మోదీ హత్యకు కొందరు దుండగులు కుట్ర పన్నారు. ఈ మేరకు ముంబైలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మోదీ హత్యకు 20 మందితో స్లీపర్‌సెల్స్ రెడీగా ఉన్నట్లు ఈ-మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు. 20 కేజీల ఆర్‌డీఎక్స్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే కేంద్ర భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. బెదిరింపు ఈ-మెయిల్‌పై కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ-మెయిల్‌ను ఎవరు పంపారో కేంద్ర భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి.