ప్రస్తుత కాలంలో మధుమేహం లేదా డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరగడం మనం చూస్తున్నాం. గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులకు మాత్రమే వస్తుందని భావించేవారు, కానీ నేడు మారుతున్న జీవనశైలి , ఆహారపు అలవాట్ల వల్ల యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ అనేది ప్రాథమికంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి సంబంధించిన వ్యాధి అయినప్పటికీ, దాని ప్రభావం శరీరంలోని ప్రతి భాగాన్ని తాకుతుంది. ముఖ్యంగా, రక్తంలో చక్కెర స్థాయి చాలా కాలం పాటు…