ఇస్మార్ట్ శంకర్‌తో మాసివ్ హిట్ అందుకున్న రామ్ పోతినేని.. అదే జోష్‌లో రెండు సినిమాలు చేశాడు. అందులో రెడ్ మూవీ ఓటిటికే పరిమితం అవగా.. ది వారియర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అందుకే ఇప్పుడు ఇస్మార్ట్ హీరోకి అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. అది కూడా ఊరమాస్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాంటి హిట్ కావాలంటే.. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ ఉండాల్సిందే. అందుకే బోయపాటితో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు రామ్. దసరా…
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత… ఒక సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ చెయ్యడమే కష్టం అవుతుంది. నెలలకి నెలలు వాయిదా పడుతూ, చెప్పిన డేట్ కన్నా ఎంతో డిలేతో ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఇలాంటి సమయంలో మా సినిమా మాత్రం చెప్పిన డేట్ కన్నా నెల రోజుల ముందే రిలీజ్ చేయబోతున్నాం అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసారు బోయపాటి శ్రీను-రామ్ పోతినేని. ఈ ఊర మాస్ డైరెక్టర్ అండ్ ఇస్మార్ట్ హీరో కలిసి…