భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా ఆరో రోజుకు చేరింది. కార్తీక మాసాన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరుగుతోంది. ఆరోరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈరోజు కార్యక్రమంలో ముందుగా శంఖారావం పూరించిన తర్వాత హైదరాబాద్ రామకృష్ణమఠానికి చెందిన శ్రీశితికంఠానంద స్వామి, రాజమహేంద్రవరం రామకృష్ణమఠానికి చెందిన శ్రీవినిశ్చలానంద స్వామి,…