మలయాళ ప్రేక్షకులకి జియో సినిమా షడ్రసోపేతమైన విందు వడ్డించబోతోంది! ‘షట్’ అంటే ఆరు కాబట్టి… ఆరు రకాల రసాలతో ప్రేక్షకుల్ని ఆనందపరిచే సిక్స్ డిఫరెంట్ మూవీస్ వరుసగా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తోంది. జియో సినిమా ప్రకటించిన తాజా తేదీల ప్రకారం రెండు చిత్రాలు నేరుగా జనం ముందుకి వస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ లేకుండానే ప్రేక్షకులకి అందుబాటులోకి రానున్న రెండు కొత్త సినిమాలు కాకుండా మరో నాలుగు క్రేజీ చిత్రాలు కూడా త్వరలోనే అందరూ చూడవచ్చు.…