విజయ్ హీరోగా రూపొందుతున్న తాజా మూవీ “బీస్ట్”. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సెల్వరాఘవన్, గణేష్, అపర్ణ దాస్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, లిల్లీపుట్ ఫారుకీ, అంకుర్ అజిత్ వికల్ సహాయక పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం నటుడు శివకార్తికేయన్ “బీస్ట్” కోసం లిరిక్ రైటర్ గా మారుతున్నారు. ఈ సినిమాలోని…