చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు కళకళలాడటం కనిపిస్తోంది. దానికి కారణం కథాబలం ఉన్న రెండు చిత్రాలు శుక్రవారం జనం ముందుకు రావడమే! అందులో ఒకటి ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించిన 'సీతారామం' కాగా, మరొకటి వైజయంతి మూవీస్ బ్యానర్ కు ఆ పేరు పెట్టిన ఎన్టీయార్ మనవడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించి, నిర్మించిన 'బింబిసార' కావడం. 'సీతారామం'ను క్లాస్ ఆడియెన్స్ మెచ్చుకుంటుంటే,