జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీతా సోరెన్‌పై జేఎంఎం అధిష్టానం వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెపై ఈ వేటు పడింది.
జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎంలో సొంత కుటుంబం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడి భార్య, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఆ పార్టీకి గట్టి షాకిచ్చారు.