తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప పాటలను అందించిన గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు. ఈ న్యూమెనియోతో బాధపడుతున్న ఆయన నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. అయితే ఈ రోజు సాయంత్రం సిరివెన్నెల మరణవార్తతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిరివెన్నెల మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిరివెన్నెల మృతిపై విలక్షణ నటుడు మోహన్‌బాబు స్పందిస్తూ..…
న్యూమోనియాతో బాధపడుతూ ప్రముఖ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటి నుండి నిపుణుల వైద్య బృందం చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం కన్నుమూశారు. సిరివెన్నెల మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.…
ప్రముఖ కవి సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నాకు ఎంతో ఆత్మీయులు అని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సిరివెన్నెల సినిమా తన ఇంటి పేరుగా మార్చింది. సిరివెన్నెల లోని పాటలు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు ప్రజలకు గుర్తుండిపోయే పాటలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన గేయాల ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి గొప్పతనాన్ని…
ప్రముఖ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల మరణంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటి నుండి నిపుణుల వైద్య బృందం చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం కన్నుమూశారు. సిరివెన్నెల మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… సిరివెన్నెల సీతారామశాస్త్రి నడిచే నక్షత్రంలా స్వర్గద్వారాలవైపు…
ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్ రణంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సీతారామశాస్త్రి మరణం రాష్ట్ర ప్రజలకు, సినీ పరిశ్రమకు తీరని లోటు. సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.దాదాపు 3 వేల పాటలు రచించిన సీతారామశాస్త్రి ఉత్తమ పాటల రచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించిన గొప్ప రచయిత. తెల్లారింది లెగండోయ్…. నిగ్గదీసి…
తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడా. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం.…
తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నో వైవిధ్యభరితమైన పాటలను అందించిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొన్ని రోజుల అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. హ్యట్రిక్‌గా నంది అవార్డులు అందుకున్న సిరివెన్నెల మన మధ్యలేరని విషయం తెలియడంతో ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల మృతిపై స్పందించిన నందమూరి బాలకృష్ణ.. ‘సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని…
సిరివెన్నెల పేరులో సీతారాముడున్నా, ఆయన మనసులో మాత్రం కైలాసవాసుడే కొలువై ఉన్నాడని చెప్పకతప్పదు. నుదుట త్రిపుండ్రాలు పెట్టి చిరునవ్వులు చిందిస్తూ కవిత్వం పలికించేవారు సీతారామశాస్త్రి. సందర్భం ఏదైనా సరే, అలవోకగా పదబంధాలు పేర్చేవారు. తన కెరీర్ లో శివునిపై పలు పాటలు పలికించి పులకింప చేశారు సీతారామశాస్త్రి. ‘సిరివెన్నెల’లోనే “ఆది భిక్షువు వాడినేది కోరేది… బూడిదిచ్చేవాడినేది అడిగేది…” అంటూ నిందాస్తుతితో శివునిపై ఆయన పలికించిన గీతం ఈ నాటికీ భక్తకోటిని పులకింప చేస్తూనే ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి…
ఏ గీత రచయితకైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక్కసారైనా ఉత్తమ గీత రచయితగా నిలవాలన్న అభిలాష ఉంటుంది. తెలుగు చిత్రసీమలోనూ అలాంటి కోరికతో ఎంతోమంది గీతరచయితలు సాగుతున్నారు. కొందరిని అవార్డులు వరించాయి. కొందరి పాటలు మురిపించినా, జనం రివార్డులతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. తెలుగు సినిమా రంగంలో పదకొండు సార్లు రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను అందుకున్న ఏకైక గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చరిత్ర సృష్టించారు. ఆ మాటకొస్తే నంది అవార్డుల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక పాటల రచయిత…
తెలుగు చిత్రసీమలో వెలసిన పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించే సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా…