చేంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిన రోజు జూన్ 5 1986! ఆ రోజున కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ చిత్రం విడుదలైంది. దానికి ముందు సీతారామశాస్త్రి రాసిన గీతం ఒకటి ‘జననీ జన్మభూమి’ చిత్రంలో ఉన్నా టైటిల్ కార్డ్స్ లో ఆయన పేరు చేంబోలు సీతారామశాస్త్రిగానే పడింది. ఏ ముహూర్తాన ఆయన ‘సిరివెన్నెల’ను ఇంటి పేరుగా మార్చుకున్నారో గానీ జీవిత చరమాంకం వరకూ తన కలం ద్వారా సినీ వనంలో సిరివెన్నెల కురిపిస్తూనే ఉన్నారు. మే…