తెలంగాణలో జరుగుతున్న రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి మాజీ మావోయిస్టు నేత జ్యోతి బరిలోకి దిగుతున్నారు. మావోయిస్టు పార్టీలో 19 సంవత్సరాలుగా పనిచేసి ప్రజా సమస్యల పోరాటానికి కృషి చేశానని, 2023 సంవత్సరంలో సంవత్సరంలో లొంగిపోయిన అనంతరం, గ్రామంలో ప్రజల సమస్యలపై దృష్టి సాధించినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం లొంగి పోయిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి సర్పంచిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లికి చెందిన నేరెళ్ల…