షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ వీడియోలు, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షణ్ముఖ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని తన అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. గత ఏడాది జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ వెలుపల షణ్ముఖ్‌పై విపరీతమైన ప్రతికూలత ఏర్పడింది.…