కన్నడ సినీ పరిశ్రమలో రాకింగ్ స్టార్ యష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తల్లి శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆమె PA ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించి, కన్నడ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు డా. రాజ్‌కుమార్, ఆయన భార్య పార్వతమ్మ రాజ్‌కుమార్ స్ఫూర్తితో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు. పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాతగా తొలి చిత్రం ‘కొత్తలవాడి’. ప్రతిభావంతుడైన నటుడు పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తున్న…